మహిళా సత్తా చాటుతారా? | Women candidates increase in Delhi elections | Sakshi
Sakshi News home page

మహిళా సత్తా చాటుతారా?

Jan 29 2025 5:31 AM | Updated on Jan 29 2025 5:31 AM

Women candidates increase in Delhi elections

గడిచిన నాలుగు దశాబ్ధాలతో పోలీస్తే ఢిల్లో ఎన్నికల్లో పెరిగిన మహిళా అభ్యర్థులు

ఈ ఎన్నికల్లో అత్యధికంగా 96 మంది బరిలో

ఆప్, బీజేపీల నుంచి చెరో తొమ్మిది, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు పోటీలో 

గడిచిన ఐదు ఎన్నికల్లో 10 శాతం కూడా దాటని మహిళా ప్రతినిధ్యం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్న పార్టీలు మహిళా అభ్యర్థులను బరిలో నిలిపినా ఎంతమంది చట్ట సభల్లో అడుగు పెడతారన్న దానిపై ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. గడిచిన నాలుగు దశాబ్ధాలతో పోలిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగ్గా, గెలుపు తీరాన్ని ఎంతమంది చేరుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ 10 శాతం కూడా దాటని మహిళా ప్రాతినిధ్యం ఈసారైనా పెరుగుతుందా? అన్నది ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి.  

అభ్యర్థులు పెరిగారు.. ప్రాతినిధ్యం సంగతేంటో? 
ఢిల్లీకి గతంలో ముగ్గురు మహిళా ముఖ్యమంత్రులు పనిచేశారు. 1998లో బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, 1998– 2013 వరకు వరుసగా మూడుసార్లు కాంగ్రెస్‌ నుంచి షీలా దీక్షిత్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆప్‌కి చెందిన అతిశి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఢిల్లీ అసెంబ్లీలో మహిళా ప్రతినిధుల సంఖ్య 10 శాతం దాటలేదు. 2003 నుంచి ఇప్పటివరకు గత అసెంబ్లీలో మాత్రమే 10 శాతం అంటే 8 మంది గెలిచారు. ఈ ఎనిమిది మంది ఆప్‌ పార్టీకి చెందిన వారే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా పోటీ దారుల సంఖ్య పెరిగింది.

ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి కలిసి 96 మంది (14 శాతం) మహిళలు బరిలో నిలిచారు. ఇందులో ఆప్, బీజేపీల నుంచి తొమ్మిదేసి మంది ఉండగా, కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు ఉన్నారు. 1993లో, 1,316 మంది అభ్యర్థులలు పోటీలో ఉండగా, అందులో 58 మంది మహిళలు పోటీ చేయగా, 1998లో ఈ సంఖ్య 57కి తగ్గింది. 2003లో 78 మహిళలు, 2008లో 81, 2013లో 71, 2015లో 66కి మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా, 2020లో 79 మంది మహిళలు పోటీ చేయగా, 10 శాతం (8) మంది విజయం సాధించారు. ఈసారి పోటీలో ఉ న్న 96 మంది మహిళలతో విజయాల రేటు రేటు మెరుగుపడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇక పార్టీల వారీగా చూస్తే 2008 నుంచి బీజేపీకి ఒక్కరంటే ఒక్క మహిళా ఎమ్మెల్యే లేరు.

2008లో నలుగురు, 2013 లో ఐదుగురు, 2015లో ఎనిమిది, 2020లో ఆరు మందిని మహిళలను పోటీలో నిలిపినా ఎవరూ గెలువలేదు. ఈ సారి 9 మందిని బరిలో పెట్టి ఖాతా తెరవాలనే తాపత్రయంతో ఉంది. ఇక కాంగ్రెస్‌కు 2008లో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఆ తర్వాత వారినుంచి ప్రాతినిధ్యమే లేదు. ఈసారి ఏడుగురు మహిళలను పార్టీ రంగంలోకి దించి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక ఆప్‌ మాత్రం 2013 నుంచి స్థిరంగా విజయాలను నమోదు చేస్తోంది. 2013లో ఆరుగురిలో ముగ్గురు గెలవగా, 2015లో ఆరింటికి ఆరు, 2020లో తొమ్మిదిలో ఎనిమిది మంది గెలిచారు. ఆసారి తొమ్మిది మంది అభ్యర్థులను బరిలో పెట్టింది.

ఆప్‌ ముఖ్యమంత్రి అతిశి, సీనియర్‌ ఎమ్మెల్యేలు రాఖీ బిద్లాన్, పర్మిలా టోకాస్, ధన్వతి చండేలా, బందన కుమార్, సరితా సింగ్‌లతో సహా ఏడుగురు మహిళా అభ్యర్థులను ఈసారి మళ్లీ పోటీలో పెట్టింది. మహిళలు మళ్లీ ఆకట్టుకునేందుకు ఆప్‌ ప్రభుత్వం కొద్ది నెలల ముందు మహిళలకు ప్రతి నెలా రూ. 1,000 అందించడానికి ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆప్‌ తిరిగి అధికారంలోకి వస్తే దీన్ని నెలకు రూ.2,100 పెంచుతామన్న హామీతో తిరిగి వారి మద్దతు కూడగట్టే పనిలో పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement