ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె | Congress banks on President's daughter to win Delhi's GK seat | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె

Jan 15 2015 2:29 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె - Sakshi

ఎన్నికల బరిలో ప్రణబ్ కుమార్తె

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలువనున్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలువనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 2008లో ఈ స్థానం నుంచి చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రపతి కుమార్తె అయినప్పటీకి శర్మిష్ట తన తండ్రి ప్రభావం ఏమీ లేకుండా ఆమె సాదాసీదాగా ప్రచారం చేసుకుంటున్నారు.

'తన తండ్రి రాష్టపతిగా కాకుండా ప్రజల మనిషిగా నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడు ఆమె తెలిపారు. దేశాధినేత కుమార్తె కావటంతో తన గెలుపుపై ఎక్కవ అంచనాలు ఉన్నాయన్న సంగతిని ఆమె అంగీకరించారు.  కైలాష్ ఒక అసెంబ్లీ స్థానం మాత్రమే కాదు... 1986 నుంచి అది మాకు సొంత ఇంటితో సమానమని' శర్మిష్ట వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement