క్లీన్ ఇమేజ్‌తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్‌ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్‌తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్‌ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా కమలనాధులు... కిరణ్‌బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ఇప్పుడు... ఢిల్లీలో బీజేపీ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసే అవకాశాలున్నాయి.
ప్రధానంగా రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ అంటే తమదే అనే ఆమ్ ఆద్మీ పార్టీకి... ఇప్పుడు కిరణ్‌బేడీ గట్టిపోటి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నలభై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న కిరణ్‌బేడీకి... నిజాయితీ పరురాలు అనే ఇమేజ్ ఉంది. దాదాపు 35 ఏళ్లపాటు ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్న బేడీని... బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో విస్తృతంగా వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.