దేశరాజకీయాల్లోని అవినీతిని ఊడ్చిపారేస్తామంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీవాసులు బాసటగా నిలబడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీకి అపూర్వ ఆదరణ
Dec 9 2013 12:00 AM | Updated on Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజకీయాల్లోని అవినీతిని ఊడ్చిపారేస్తామంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీవాసులు బాసటగా నిలబడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం నాటి ఫలితాల్లో ఏకంగా 28 స్థానాలు గెలుపొందింది. ఆప్ మొదటి నుంచి అవలంభించిన పంథా ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ఓటు షేర్ పరంగా చూస్తే బీజేపికి 34శాతం ఓట్లు రాగా, ఆమ్ ఆద్మీ పార్టీ 32 శాతం రాబట్టింది. దాదాపు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ నంతా తమ ఖాతాలోకి వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 16 స్థానాలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న 11 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోవడం విశేషం. కే జ్రీవాల్ చేపట్టిన ఉద్యమాలు, ఇచ్చిన హామీలు, ప్రచారం చేసిన తీరు ఢిల్లీవాసికి దగ్గర చేసింది. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై పోటీ చేస్తానంటూ కేజ్రీవాల్ చేసిన సవాల్ దేశవ్యాప్తంగా ఆ పార్టీపై చర్చకు దారితీసింది. కేజ్రీవాల్ పార్టీకి పడిన ఓట్లతో అగ్రభాగం యువతదే. ఢిల్లీలో ఈ మారు కొత్త ఓటర్లు 47శాతం మంది చేరారు. వీరిలోఎక్కువ మంది హర్యానా నుంచి వచ్చిన వారే. అరవింద్ కేజ్రీవాల్ సైతం హర్యానాకి చెందిన వాడే కావడంతో మరింత లాభించింది. షీలాదీక్షిత్‌పై 25,864 ఓట్ల మెజార్టీతో కేజ్రీవాల్ తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు.
Advertisement
Advertisement