కేజ్రీవాల్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు

Delhi BJP Chief Manoj Tiwari Exclusive Interview - Sakshi

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్‌, ఎంపీ మనోజ్‌ తివారీ అన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆయన తన ఎమ్మెల్యేలతో కొట్టించారని, ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సాక్షి టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

కేజ్రీవాల్ పరిపాలన నచ్చకపోవడంతోనే.. ఆయనకు వ్యతిరేకంగా వందలమంది నామినేషన్లు వేశారని అన్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 సీట్లకుపైనే వస్తాయని అన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం రాకపోవడం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందన్నారు. దేశానికి మోదీ, ఢిల్లీకి బీజేపీ అనేది తమ నినాదమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎక్కడ గుడిసె ఉందో, అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టించి.. గ్యాస్, టాయిలెట్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. కుషాల్ ఢిల్లీ తమ లక్ష్యమన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top