త్వరలో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ వరాల జల్లు కురిపిస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో లక్ష నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
ఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ వరాల జల్లు కురిపిస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, వెంకయ్యలు హాజరయ్యారు. కేంద్ర సాయం లేకుండా ఢిల్లీ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని వెంకయ్య తెలిపారు.
మేక్ ఇన్ ఇండియా సాయంతో దేశంలో నిరుద్యోగాన్ని పారద్రోలుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. జమ్మూ కశ్మీర్ లో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ సీట్లు గెలుచుకుందని అమిత్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ తరుపున ముగ్గురు సీఎంలు అయ్యారని.. బీజేపీతోనే దేశ, రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.