అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 25 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈసారి మళ్లీ 22 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు గెలిచారని, వీరిలో 15 మందిపై కేసులు ఉన్నాయని అసోసియేషన్
25 మంది ఎమ్మెల్యేలు నేరచరితులే
Dec 10 2013 12:15 AM | Updated on Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 25 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈసారి మళ్లీ 22 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు గెలిచారని, వీరిలో 15 మందిపై కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. బీజేపీ నుంచి 17 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయని, ఆ పార్టీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ కూడా నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ సభ్యుడు తెలిపారు. బీజేపీ నుంచి 31 మంది గెలవగా, వీరిలో 13 మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై దాడులు తదితర తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో ముగ్గురు, కాంగ్రెస్‌లో ఇద్దరు, శిరోమణి ఆకాళీ దళ్, జేడీ (యూ) స్వతంత్ర అభ్యర్థిపై నేరాభియోగాలు ఉన్నాయని వెల్లడించారు.
Advertisement
Advertisement