Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Yellow Gang Plans Attacks On Votes counting day
అంతకు మించి అరాచకం!

సాక్షి, అమరావతి: ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చ ముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. పోలింగ్‌ సంద­ర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్ప­డిన టీడీపీ రౌడీ మూకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరి తెగించేందుకు పథకం రూపొందించి­నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటివరకు పోలీ­సులు అరెస్ట్‌ చేసిన వారితోపాటు అదుపులోకి తీసు­కున్న వారిలో 75% మంది టీడీపీకి చెందిన­వారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలకు అద్దంపడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అలజడులు రేకెత్తించడం, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బీభత్సం సృష్టించేందుకు భారీ కుట్రలకు తెర తీశాయి. పచ్చ ముఠాలు, అల్లరి మూకలు విసురుతున్న సవాల్‌ను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్‌ సందర్భంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు అరాచకాలకు తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా చోట్ల విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పటిష్ట నిఘా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు శాఖసోదాలు నిర్వహిస్తోంది. నేర చరితులను అదుపులోకి తీసుకుంటోంది. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను, రికార్డులు లేని వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేపట్టింది. బదిలీలతో అల్లరి మూకల అరాచకం..రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకలు యథేచ్చగా విధ్వంస కాండకు తెగబడ్డాయి. చంద్రబాబు, పురందేశ్వరిఈసీపై ఒత్తిడి తెచ్చి పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని నియమించుకుని పన్నాగాన్ని అమలు చేశారు. ప్రధానంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులు, రాడ్లతో విరుచుకుపడటంతోపాటు బాంబు దాడులకు కూడా తెగబడి బీభత్సం సృష్టించాయి.గూండాగిరీ అంతా పచ్చముఠాదేపోలింగ్‌కు ముందు, అనంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినవారిని గుర్తించి పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. ఎన్నికల ముందు నమోదైన కేసులతో ప్రమేయం ఉన్న 1,522 మందిని గుర్తించి కొందరిని అరెస్ట్‌ చేసింది. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. వీరితో దాదాపు 1,300 మంది టీడీపీ వర్గీయులే కావడం గమనార్హం. ఇక పోలింగ్‌ రోజు దాడులు, ఘర్షణల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,790 మందిని గుర్తించగా కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చారు. పోలింగ్‌ రోజుల అరాచకాలకు తెగబడ్డ వారిలో దాదాపు 2,400 మంది టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీ కుట్రలను బట్టబయలు చేస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 85 మందిపై హిస్టరీ షీట్లను తెరవగా వీరిలో 58 మంది టీడీపీ వర్గీయులే ఉన్నారు. టీడీపీకి చెందిన ముగ్గురిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించగా మరో ఇద్దరిని జిల్లాల నుంచి బహిష్కరించారు. పోలీసుశాఖ గత మూడు రోజులుగా 301 సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌ – సెర్చ్‌ ఆపరేషన్ల ద్వారా విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఎటువంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేసింది. 482 లీటర్ల సారాయి, 3,332 లీటర్ల అక్రమ మద్యం, 436 లీటర్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద టీడీపీ మూకలు అరాచకాలకు తెగబడే ప్రమాదం ఉన్నందున పటిష్ట బందోబస్తు కల్పించారు. 350 స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలకు కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు 24/7 మూడంచెల భద్రతతో పహరా కాస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు బాడీ వార్న్‌ కెమెరాలను సమకూర్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద వెయ్యికి పైగా అధునాతన ఫేస్‌ రికగ్నైజేషన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్‌), ఎస్పీ/ పోలీస్‌ కమిషనర్లు పాసులు జారీ చేసిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు వచ్చిన అధికారులు, సిబ్బంది వివరాలను నమోదు చేస్తున్నారు. వీడియోగ్రఫీ ద్వారానే లోపలికి అనుమతిస్తున్నారు. అన్ని స్ట్రాంగ్‌రూమ్‌లను అనుసంధానిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో పటిష్ట నిఘా కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల చుట్టూ ఫ్లడ్‌ లైట్లను అమర్చారు. స్ట్రాంగ్‌రూమ్‌లు ఉన్న ప్రదేశానికి 2 కి.మీ. పరిధిని రెడ్‌ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెల్లూను ఎగురవేయడాన్ని నిషేధించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్‌ కేంద్రాలకు సురక్షితంగా తరలించే ప్రక్రియను ఖరారు చేశారు.అమలులో నిషేధాజ్ఞలుస్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలున్న నగరాలు, పట్టణాల్లో ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ వరకూ పోలీసు శాఖ నిషేధాజ్ఞలను విధించింది. 30 పోలీస్‌ యాక్ట్, సెక్షన్‌ 144 అమలులో ఉంటాయని ప్రకటించింది. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కర్రలు, కత్తులు, రాడ్లు, ఇతర ఆయుధాలతో సంచరించకూడదని హెచ్చరించింది. పెట్రోల్‌ బంకుల్లో విడిగా పెట్రోల్, డీజిల్‌ విక్రయించకూడదని ఆదేశించింది. అసత్య వార్తలు, ఫేక్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయకూడదని పేర్కొంది.ప్రజలు సహకరించాలి: డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాఅసాంఘిక శక్తులను కఠినంగా అణచివేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రజలు కూడా సహకరించాలి. ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. సంయమనం పాటించాలి. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల కదలికల గురించి టోల్‌ ఫ్రీ నంబర్లు 100, 112లకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమివ్వాలి.కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టంఓట్ల లెక్కింపు చేపట్టే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్ని కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే అంశంపై ఈసీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలో 33 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. లెక్కింపు త్వరగా నిర్వహించేందుకు కౌంటింగ్‌ కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ప్రతిపాదించారు. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలను నిషేధించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత 15 రోజుల వరకు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలోనే కొనసాగనున్నాయి.

Police Speed Up Investigation In Bangalore Rave Party Case
రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు

బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ బి.దయానంద్‌ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్‌ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ అని ఈ రేవ్‌పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్‌ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్‌పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్‌ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్‌లో ఫాంహౌస్‌లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్‌పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్‌లోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్‌ సిటీ పీఎస్‌ నుంచి హెబ్బగోడి పీఎస్‌కు బదిలీ చేశాం. డ్రగ్స్‌ విసిరేశారు: రేవ్‌పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్‌పూల్, టాయ్‌లెట్‌ తదితర స్థలాల్లోకి డ్రగ్స్‌ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్‌సిద్దికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్‌బావ డ్రగ్స్‌ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్‌ తెలిపారు.నిందితుల అరెస్ట్‌రేవ్‌పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్‌ సిద్ధికి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్‌కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ వెల్లడించారు. రేవ్‌పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్‌ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.

Ap Elections 2024 May 22nd Political Updates Telugu
May 22nd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 22nd AP Elections 2024 News Political Updates..8:30 AM, May 22nd, 2024ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్‌.. విజయవాడసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టిపోలింగ్ అనంతరం జరిగిన పరిమాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుకౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల రక్షణ వలయం సిద్ధం చేస్తున్న పోలీసులుకలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, నోడల్‌ అధికారులు, ఎన్‌ఐసీ, ఎన్‌కోర్‌ టీమ్‌ అధికారులతో సమావేశాలుకౌంటింగ్‌ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు, కౌన్సెలింగ్ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పగడ్బందీగా బారికేడింగ్‌ పనులుకౌంటింగ్ రోజున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలుఏపీ పోలీసులతో పాటు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న సిఆర్పిఎఫ్, పారా మిలటరీ బలగాలు 7:20 AM, May 22nd, 2024గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం: ఎమ్మెల్యే పిన్నెల్లిపల్నాడులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ నేతలు గొడవలు చేశారు. పోలింగ్‌ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంఅనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారు. పల్నాడులో వాళ్లు గెలిచే పరిస్థితి లేకపోవడంతో అందర్నీ తప్పుదోవ పట్టించేలా టీడీపీ వాళ్లు గొడవలు చేశారు. పోలింగ్ రోజు నుంచి జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకి నేను సిద్ధం.-ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి#YSRCPWinningBig#TDPLosing pic.twitter.com/cgi2SMXSmR— YSR Congress Party (@YSRCParty) May 21, 2024 7:00 AM, May 22nd, 2024ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చ ముఠాల ప్లాన్‌పోలింగ్‌ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగంకుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘావర్గాలురాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలుఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్నుగూండాలను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు.. అంతా టీడీపీ మూకలేస్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతరెడ్‌జోన్ల ఏర్పాటు.. నిషేధాజ్ఞలు విధింపు.. డ్రోన్‌ కెమెరాల వినియోగం నిషిద్ధం 6:55 AM, May 22nd, 2024సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధంజూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతిటీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడిఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారుపారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డినేను ఎక్కడికి పారిపోలేదు... ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్‌ వచ్చా ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 6:45 AM, May 22nd, 2024పవన్‌ ఎక్కడ?పవన్‌ పర్యటనపైనా రాజకీయ వర్గాల్లో చర్చ14న ప్రధాని మోదీ నామినేషన్‌కు పవన్‌ హాజరుఅక్కడి నుంచి హైదరాబాద్‌ రాకఆ తర్వాత ఎవరికీ అందుబాటులో లేని పవన్‌రష్యా లేదా దుబాయ్‌ వెళ్లి ఉంటారంటున్న పార్టీ వర్గాలు 6:40 AM, May 22nd, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 6:30 AM, May 22nd, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే.

Pinnelli Ramakrishna Reddy comments on Julakanti Brahma Reddy
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం

సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధ­మని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైద­రా­బాద్‌లో విలేకరుల­తో మాట్లా­డారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మా­రెడ్డి మాచర్ల నియో­జ­­క­­వ­­ర్గ­ంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజ­లను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్ప­టం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్‌ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపో­యాడు. ఆ తర్వాత నియోజక­వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబా­బు తీసు­కొచ్చి పల్నా­డు­లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండ­లంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంట­చింతల మండలంలో తుమృకోట, పాలవా­యి­గేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెంది­నవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టి­ంచారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతా­యని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్‌ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించు­కోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీ­సుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారి­పోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామా­జికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.

Ex Minister KTR Slams Telangana Congress Govt
‘కాంగ్రెస్‌ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్‌ వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ రాష్ట్రంలో కరెంట్‌ కోతలు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితిని చూస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నంట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నంచుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నంపాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నంరైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నంతడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాంపదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నంచివరికి ఇవాళ జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు..క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం..!కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!జై కిసాన్జై తెలంగాణఅంటూ కామెంట్స్‌ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4— KTR (@KTRBRS) May 22, 2024

Jaya Badiga becomes first Judge in California from Telugu States
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అటారీ్నగా, గవర్నర్‌ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్‌)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ

Donald Trump Biopic The Apprentice Cannes Controversy Latest News
బయోపిక్‌లో భార్య రేప్‌ సీన్‌.. షాకైన కేన్స్‌ ఆడియొన్స్‌

కేన్స్‌ ఫిల్స్‌ ఫెస్టివల్‌ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయోపిక్‌ ‘ది అప్రెంటైస్‌’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కినప్పటికీ.. ట్రంప్‌ పర్సనల్‌ లైఫ్‌లోని కొన్ని షాకింగ్‌ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్‌ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్‌ ఉంది. ఆ సన్నివేశం కేన్స్‌ ఆడియొన్స్‌ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్‌ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్‌ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్‌ టవర్‌ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్‌కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్‌) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్‌ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్‌ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్‌ అబ్బాసీఅయితే ట్రంప్‌ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ‌ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్‌ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్‌ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్‌ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్‌ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్‌ పాత్రను నటుడు సెబాస్టియన్‌ స్టాన్(మార్వెల్‌ చిత్రాల ఫేమ్‌)‌ పోషించగా.. ట్రంప్‌ వ్యక్తిగత లాయర్‌ జెర్మీ స్ట్రాంగ్‌ పాత్రలో రోయ్‌ కోన్‌, ఇవానా ట్రంప్‌ రోల్‌లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు.

Sunrisers Hyderabad Skipper Pat Cummins Looking Forward to Qualifier 2
అదే మా కొంప‌ముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్‌

హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ విఫ‌ల‌మైంది. తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 19. 3 ఓవర్లలో 159 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆలౌటైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(55) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(32), కమ్మిన్స్‌(30) పరుగులతో రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి రెండు , రస్సెల్‌,నరైన్‌, హర్షిత్‌ రనా, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. అనంత‌రం 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేకేఆర్ ఊదిప‌డేసింది. కేకేఆర్ 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కేఆర్‌ బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌(24 బంతుల్లో 58 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(51 నాటౌట్‌), గుర్భాజ్‌(23) పరుగులతో రాణించారు. ఇక క్వాలిఫ‌య‌ర్1లో ఓట‌మి పాలైన ఎస్ఆర్‌హెచ్ ఫైన‌ల్ చేరేందుకు మ‌రో అవ‌కాశం మిగిలి ఉంది. మే 24న జ‌ర‌గనున్న క్వాలిఫ‌య‌ర్‌-2లో ఆర్సీబీ లేదా రాజ‌స్తాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ స్పందించాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమయ్యాని కమ్మిన్స్ తెలిపాడు.మా ఓటమికి కారణమిదే: కమ్మిన్స్‌"ఈ ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మా​కు ఇంకా ఫైనల్స్‌కు చేరేందుకు ఛాన్స్‌ ఉంది. సెకెండ్‌ క్వాలిఫయర్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము.ప్రస్తుత టీ20 క్రికెట్‌లో ఏ రోజు ఏమి జరుగుతుందో అంచనా వేయలేం. మేము ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో, అనంతరం బౌలింగ్‌లో కూడా రాణించలేకపోయాము. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఉపయోగించాలని నిర్ణయించాం. అందుకే సన్వీర్‌కు ఛాన్ప్‌ ఇచ్చాం. కానీ మా ప్లాన్‌ బెడిసి కొట్టింది. కానీ కేకేఆర్‌ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. ప్రారంభంలో పిచ్‌ బౌలర్లకు కాస్త అనుకూలించింది. కానీ తర్వాత మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరించింది. ఇక క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ చెన్నైలో ఆడనున్నాం. చెన్నె వికెట్‌ మాకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నారు. కాబట్టి ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉందంటూ" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.

All eyes are on postal ballot votes
అందరి కన్నూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపైనే..

సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను కలిసి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్‌ పత్రంపై గెజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్‌ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యా­యి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది.

Pet Market Size Expected To Cross Rs 10,000 Crore By 2028
భారతీయుల మైండ్‌ సెట్‌ మారింది.. వేలకోట్లకు పెట్‌ మార్కెట్‌

ప్రపంచంలో మనుషుల ఒంటరి తనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్య ముప్పుకారకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.అయితే ఈ ఒంటరితనం, ఆందోళన నుంచి బయట పడేందుకు భారతీయులు పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారు. పెట్స్‌ కోసం భారతీయ కుటుంబాలు నెలవారీగా కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రూ.5 వేల వరకు పెట్స్‌ కోసం కేటాయిస్తున్నారని డ్రూల్ పెట్ ఫుడ్‌ సీఈఓ శశాంక్‌ సిన్హా తెలిపారు. రూ.10వేల కోట్లుకుఫలితంగా దేశీయ పెట్‌ కేర్‌ రంగం ప్రస్తుత విలువ రూ.5వేల కోట్లుంటే.. 2028 నాటికి ఆ మొత్తం రూ.10వేల కోట్లుకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో 31 మిలియన్ల పెట్‌ డాగ్స్‌, 2.44 పెట్‌ క్యాట్స్‌తో పెంపుడు జంతువుల పాపులేషన్‌లో భారత్‌ ఐదవ స్థానంలో నిలిచింది.యజమానులం కాదు.. తల్లిదండ్రులంపెంపుడు జంతువులను దత్తత తీసుకునే విషయంలో ధోరణి మారింది. జెన్‌జెడ్‌, మిలీనియల్స్‌ పెంపుడు జంతువులకు తమని తాము యజమానులం అనే భావన కాకుండా.. తల్లిదండ్రుల్లా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పెట్స్‌ ఆహారం, గ్రూమింగ్‌తో పాటు పెట్ కేఫ్‌లు, పెట్ ఇన్సూరెన్స్ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు.16-18 శాతం వృద్ధితోరాబోయే 5-6 సంవత్సరాల్లో పరిశ్రమ 16-18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని మార్స్ పెట్‌కేర్ ఇండియా తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్‌ మూర్తి మాట్లాడుతూ.. ఓ ‘20 ఏళ్లు వెనక్కి వెళ్లండి. పెంపుడు జంతువులు ఇంటి బయట ఉండేవి. పరిస్థితులు మారాయి. ఇంట్లోకి వచ్చాయి. కోవిడ్‌ కారణంగా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించాయి. కుటుంబంలో భాగమయ్యాయి. జంతుప్రేమికులు పెరిగారు. పెట్స్‌కు ఏం తినిపించాలి. ఎలాంటి ఆహారం అందించాలి. వాటికి అవసరమయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయని అడగడం ప్రారంభించారని తెలిపారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement