ప్రియాంక చోప్రా న్యూ లుక్‌! ఏకంగా రూ. 300 కోట్ల డైమండ్‌ నెక్లెస్‌.. | Sakshi
Sakshi News home page

ప్రియాంక చోప్రా న్యూ లుక్‌! ఏకంగా రూ. 300 కోట్ల డైమండ్‌ నెక్లెస్‌..

Published Tue, May 21 2024 5:44 PM

Priyanka Chopras New Hair To The 200-Carat Diamond Necklace

బాలీవుడ్‌ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. పలు ఫ్యాషన్‌ వేడుకలకు తన డిజైనర్‌వేర్‌ డ్రెస్‌లతో మిస్మరైజ్‌ చేస్తుంది. అలానే రోమ్‌లో జరిగిన బల్గారీ ఈవెంట్‌కు హాజరైన ప్రియాంక తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సరికొత్త హెయిర్‌ స్టైల్‌తో ప్రియాంక ప్రేక్షకులను అలరించింది. 

పైగా ఆ హెయిర్‌ స్టైల్‌కి తగ్గట్టు నలుపు, తెలపు కాంబినేషన్‌ గౌను, అందుకు తగ్గట్టు డైమండ్‌ నెక్లస్‌ని ధరించి అత్యద్భుతంగా కనిపించింది. నెక్‌కు కోట్లు ఖరీదు చేసే 200 క్యారెట​ డెమండ్‌ నెక్లెస్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. బల్గేరి అటెర్నె బ్రాండ్‌కి చెందిన ఈ నెక్లెస్‌ అత్యంత లగ్జరియస్‌ జ్యువెలరీ. ఈ మేరకు ఈ విషయాన్ని బల్గారీ అధికారిక వెబ్‌సైట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఫ్యాషన్, పాప్ సంస్కృతిని ఫాలో అయ్యే ఇన్‌స్టాగ్రామర్‌ డైట్‌ సబ్యా కూడా ఈ నెక్లెస్ మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

ఈ నెక్లెస్‌ రూపొందిచడానికి దాదాపు 2,800 గంటలు శ్రమతో కూడిన నైపుణ్యం అవసమరమని, ఇది చాలా కఠినమైన వజ్రమని తెలిపారు. దీన్ని 140 క్యారెట్ల ఏడు పియర్‌ ఆకారపు చుక్కలుగా రూపొందించడానికే ఇంత సమయం తీసుకుంటుందని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ బ్రాండ్‌ చరిత్రలో ఇది అత్యద్భుతమైన నెక్లెస్‌ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో ప్రియాంక ధరించిన కళ్లమిరుమిట్లు గొలిపే డైమండ్‌ నెక్లెస్‌ తోపాటు ఆమె కొత్త హెయిర్‌ స్టైల్‌ హైలెట్‌గా నిలిచింది. ఈ నెక్లెస్‌ ధర ఏకంగా రూ. 300 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.
ఇక కనుబొమ్మలకు మెరిసే గోల్డెన్ ఐ షాడో, కనురెప్పలపై మస్కరా, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్, చెంపలపై గులాబీ రంగు బ్లష్ వంటివి హైలెట్‌గా నిలిచాయి.

 

(చదవండి: కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!)

 

Advertisement
 
Advertisement
 
Advertisement