స్వాతి మలివాల్‌పై దాడి.. ఆమ్‌ ఆద్మీ సంచలన ఆరోపణలు | Sakshi
Sakshi News home page

స్వాతి మలివాల్‌పై దాడి.. ఆమ్‌ ఆద్మీ సంచలన ఆరోపణలు

Published Fri, May 17 2024 8:07 PM

Atishi Denies Swati Maliwal Allegations

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడిపై ఆమ్‌ ఆద్మీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 

స్వాతి మలివాల్‌ ఆరోపణల్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కొట్టి పారేశారు.  ఆమె చేస్తోన్న ఆరోపణలు బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు.  

మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ అపాయింట్‌మెంట్ లేకుండా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. కేజ్రీవాల్‌ అందుబాటులో లేరు. అపాయింట్‌ లేకపోవడంపై సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఆమెను అడ్డుకున్నారు. డ్రాయింగ్ రూమ్‌లో వాదించడం ప్రారంభించింది’ అని అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు.

‘అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది. కాబట్టే బీజేపీ ఓ కుట్ర పన్నింది. అందులో భాగంగా స్వాతి మలివాల్‌ను పావుగా వినియోగించుకుంది. మే 13 ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పంపింది. అక్కడే ఆమె కథంతా నెరిపింది. తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఈరోజు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఆమె డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని పోలీసు అధికారులను బెదిరించడం కనిపించింది. తనపై క్రూరంగా దాడి చేశారిన స్వాతి ఆరోపణలకు.. వీడియోలో కస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయి

ఆ వీడియోలో స్వాతి మలివాల్‌ కనిపించారు. కొట్టినట్లు వీడియో తీస్తున్నదెవరు..ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తేనే అందరికీ నిజం తెలుస్తుంది. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆ నిజం ప్రపంచానికి తెలుస్తోంది’ అని అతిషి అన్నారు.

కాగా, స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతిషి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement