బిగ్‌బాస్‌ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు! | Sakshi
Sakshi News home page

Kiran Rathod: తీవ్ర ఒత్తిడికి గురయ్యా.. దీనికి సమాధానం కావాలి: బిగ్‌బాస్‌ బ్యూటీ

Published Tue, May 21 2024 7:34 PM

Bigg Boss Contestant Kiran Rathod Faces Problem In Visa

బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి  సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు  తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. ‍అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

ఇదిలా ఉండగా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్‌ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

కిరణ్‌ రాథోడ్‌ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్‌ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్‌ బుకింగ్‌, ట్రావెల్‌ బుకింగ్‌ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement