స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స | Sakshi
Sakshi News home page

స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స

Published Sat, May 18 2024 5:57 AM

Slovakia PM Fico undergoes new operation amid hopes for his recovery

బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. 

వెంటనే ఆయన్ను బన్‌స్కా బి్రస్టికాలోని ఎఫ్‌.డి.రూజ్‌వెల్ట్‌ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్‌ తీశామని, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్‌వెల్ట్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ మిరియమ్‌ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement