వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌: రోహిత్‌పై కేఎల్‌ రాహుల్‌ కామెంట్స్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ జట్టులో దక్కని చోటు.. రోహిత్‌పై కేఎల్‌ రాహుల్‌ కామెంట్స్‌ వైరల్‌

Published Sat, May 18 2024 11:46 AM

'Sharma Ji Ka Beta': T20 WC Snubbed KL Rahul's Cheeky Remark On Post IPL 2024 Plans

ఐపీఎల్‌-2024 లీగ్‌ దశలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ ఆఖరి మ్యాచ్‌ ఆడేసింది. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది.

అయితే, చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్‌ ఫలితంపైనే లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికైతే లక్నో దాదాపుగా నిష్క్రమించినట్లే!

ఇదిలా ఉంటే.. లీగ్‌ దశను విజయంతో ముగించడం పట్ల లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ హర్షం వ్యక్తం చేశాడు. సీజన్‌ ఆసాంతం ఇలాగే ఆడి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో ఓవరాల్‌గా తమ ప్రదర్శన మాత్రం నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు.

ఫ్రాంఛైజీ మయాంక్‌ యాదవ్‌, యుధ్‌వీర్‌ వంటి భారత యువ ఆటగాళ్ల మీద భారీ మొత్తం పెట్టుబడి పెట్టిందని.. అయితే, గాయాల కారణంగా వారు తమ పని పూర్తి చేయలేకపోయారని కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. 

నేను మా మామగారి జట్టులో ఉన్నా
అదే విధంగా.. తన బ్యాటింగ్‌ పొజిషన్‌పై దృష్టి సారించానని.. మిడిలార్డర్‌లో ఆడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు తెలిపాడు. కాగా ఈ ఎడిషన్‌లో లక్నో 14 మ్యాచ్‌లలో ఏడు గెలిచింది. ఇక ఐపీఎల్‌-2024 తర్వాత తదుపరి ప్రణాళికలు ఏమిటన్న ప్రశ్నకు కేఎల్‌ రాహుల్‌ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను మా మామగారి జట్టులో ఉన్నాను. 

ఇద్దరం కలిసి ప్రపంచకప్‌ టోర్నీలో ఆడే శర్మా జీ వాళ్ల అబ్బాయిని చీర్‌ చేస్తాం’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో ఆడనున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

తన మామగారు, బాలీవుడ్‌ నటుడు సునిల్‌ శెట్టితో కలిసి మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తానని తెలిపాడు. కాగా జూన్‌ 1 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. వికెట్‌ కీపర్‌ కోటాలో రాహుల్‌ను కాదని రిషభ్‌ పంత్, సంజూ శాంసన్‌లకు చోటిచ్చింది బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ!

చదవండి: BCCI: హార్దిక్‌ పాండ్యాకు ఊహించని షాక్‌.. ఐపీఎల్‌ 2025లో ఇక..

 

Advertisement
 
Advertisement
 
Advertisement