ఓటేసిన స‌చిన్, సూర్య‌కుమార్.. ఫోటోలు వైర‌ల్‌ | Sakshi
Sakshi News home page

Lok Sabha elections 2024: ఓటేసిన స‌చిన్, సూర్య‌కుమార్.. ఫోటోలు వైర‌ల్‌

Published Mon, May 20 2024 2:24 PM

Sachin Tendulkar, Suryakumar Yadav and Ajinkya Rahane cast vote in mumbai

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో ద‌శలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొన‌సాగుతోంది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 

ఈ నేప‌థ్యంలో ప‌లువురు క్రికెట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెట‌ర‌న్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్క‌ర్ సైతం ఓటు వేశారు. 

స‌చిన్ త‌న త‌న‌యుడు అర్జున్‌తో క‌లిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో త‌మ‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేష‌న్ బ‌య‌ట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోల‌కు ఫోజులిచ్చారు. 

అదేవిధంగా సూర్య‌కుమార్ సైతం ఓటు వేసిన అనంత‌రం త‌న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణ‌యించే ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని సూర్య పిలుపునిచ్చాడు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement