అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం | Jaya Badiga becomes first Judge in California from Telugu States | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

May 22 2024 9:50 AM | Updated on May 22 2024 9:52 AM

Jaya Badiga becomes first Judge in California from Telugu States

కాలిఫోర్నియాలో శాక్రమెంటో 

సుపీరియర్‌ కోర్టు జడ్జిగా జయ నియామకం 

స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం  
 

చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. 

అనంతరం అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అటారీ్నగా, గవర్నర్‌ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్‌)గా పనిచేశారు.  

గర్వకారణంగా ఉంది 
నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు 
గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది.  
    – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement