నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం | Pinnelli Ramakrishna Reddy comments on Julakanti Brahma Reddy | Sakshi
Sakshi News home page

నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధం

May 22 2024 5:14 AM | Updated on May 22 2024 1:21 PM

Pinnelli Ramakrishna Reddy comments on Julakanti Brahma Reddy

జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి

టీడీపీ అనుకూల గ్రామాల్లో మా ఏజెంట్లపై దాడి

ఆ గ్రామాల్లోనే అలజడి సృష్టించారు

పారిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉండేది బ్రహ్మారెడ్డి

నేను ఎక్కడికి పారిపోలేదు.. 

ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పోలీసుల సూచన మేరకు హైదరాబాద్‌ వచ్చా 

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధ­మని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైద­రా­బాద్‌లో విలేకరుల­తో మాట్లా­డారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మా­రెడ్డి మాచర్ల నియో­జ­­క­­వ­­ర్గ­ంలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజ­లను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్ప­టం హాస్యాస్పదంగా ఉంది. 

ఏడు మర్డర్‌ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపో­యాడు. ఆ తర్వాత నియోజక­వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబా­బు తీసు­కొచ్చి పల్నా­డు­లో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండ­లంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంట­చింతల మండలంలో తుమృకోట, పాలవా­యి­గేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెంది­నవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టి­ంచారు. 

కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతా­యని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్‌ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించు­కోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీ­సుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారి­పోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామా­జికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. 

టీడీపీని గెలిపించేందుకు  సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement