అత్యవసర చికిత్సకు గుంటూరు వెళ్లాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

అత్యవసర చికిత్సకు గుంటూరు వెళ్లాల్సిందే..

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

అత్యవసర చికిత్సకు గుంటూరు వెళ్లాల్సిందే..

నరసరావుపేట మండలం లింగంగుంట్లకు చెందిన కల్యాణి మూర్చవ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో ఇంటిపై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలయాయ్యయి. సమీపంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అవసరమని, గుంటూరుకు తీసుకెళ్లమని సూచించారు. ఆమె బంధువులు అప్పటికప్పుడు 108 సాయంతో జీజీహెచ్‌కు తరలించాల్సి వచ్చింది. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అత్యవసర సేవలు కూడా అందుబాటులో లేకపోవడం రోగులకు భారంగా మారింది. మరోవైపు కార్డియాలజీ విభాగం లేకపోవడంతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలు అధికంగా ఉండే పల్నాడు జిల్లా లో కీలకమైన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో అన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నరసరావుపేట వైద్యశాల నుంచి గుంటూరు

జీజీహెచ్‌కు బాధితురాలు కల్యాణి తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement