Lok Sabha Election 2024: దక్షిణాన కాషాయ జెండా | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: దక్షిణాన కాషాయ జెండా

Published Tue, May 21 2024 4:25 AM

Lok Sabha Election 2024: PM Narendra Modi confident of BJP big win in South

అతి పెద్ద పార్టీగా బీజేప

తూర్పునా అవే ఫలితాలు

ప్రధాని మోదీ విశ్వాసం 

రెండుచోట్లా అభిమాన వెల్లువ 

దాంతో విపక్షాలకు నిద్ర కరువు 

400 ప్లస్‌తో ఎన్డీఏ రికార్డు ఖాయం 

మైనారిటీలను నేనెన్నడూ వ్యతిరేకించలేదు 

అంబానీ, అదానీలతో కాంగ్రెస్‌కు డీల్‌ 

అందుకే ప్రచారంలో వారి ఊసెత్తని రాహుల్‌ 

భువనేశ్వర్‌: దక్షిణ భారతదేశంలో ఈసారి కూడా బీజేపీయే అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వెలిబుచ్చారు. దేశమంతటా ఎన్డీఏకు స్థానాలు పెరుగుతాయని, ముఖ్యంగా దక్షిణ, తూర్పు భారతదేశంలో బీజేపీ బలం మరింతగా పెరగనుందని జోస్యం చెప్పారు. ‘‘దళిత, ఓబీసీ, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో ఉన్న పార్టీ బీజేపీయే. 

కానీ ‘బీజేపీ పట్టణ పార్టీ, కేవలం ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణ–బనియా పార్టీ’ అంటూ దుష్ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దక్షిణాదిన మాకు బలం లేదన్నది కూడా విపక్షాలు వ్యాప్తి చేసిన అలాంటి అపోహే. దేశాన్ని సర్వనాశనం చేసేందుకు ఇలాంటి అపోహలను ప్రచారంలో పెట్టాయి. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరిగింది? దక్షిణ భారతంలో బీజేపీయే అతి పెద్ద పారీ్టగా అవతరించింది. 

అప్పటితో పోలిస్తే అక్కడి ప్రజల మనసును మరింతగా గెలుచుకున్నాం. ఆ లెక్కన దక్షిణాదిన ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం. మా భాగస్వాములనూ కలుపుకుంటే అక్కడ ఎన్డీఏ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది’’ అన్నారు. ఆదివారం పీటీఐ ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన 131 లోక్‌సభ స్థానాల్లో 2019లో బీజేపీకి 29 సీట్లు రావడం తెలిసిందే. 

తూర్పు భారతదేశంలో దశాబ్దాల అభివృద్ధి లేమిని పక్కా ప్రణాళికతో పదేళ్లలో తుడిచిపెట్టామని మోదీ అన్నారు. ‘‘మొత్తం తూర్పు భారతాన్నీ సాధికారపరిచాం. ఫలితంగా ‘రెడ్‌ కారిడార్‌’గా పిలిచే ఆ ప్రాంతం ‘కాషాయ కారిడార్‌’గా మారిపోయిందని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయనున్నాయి. పలు తూర్పు రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని సారథ్యంలోని ఇండియా కూటమి ఖాతా కూడా తెరవలేవు’’ అని జోస్యం చెప్పారు.

 దాంతో భువనేశ్వర్, కోల్‌కతాతో పాటు ఢిల్లీలోనూ కొన్ని పారీ్టలకు ఇప్పట్నుంచే కంటిపై కునుకు కరువైందని బిజూ జనతాదళ్, తృణమూల్, కాంగ్రెస్‌లను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల ఆశీస్సులతో మేమీసారి రికార్డు స్థాయి విజయం సాధించబోతున్నాం. 

జూన్‌ 4న వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాలు సాధించడం ఖాయం (4 జూన్, 400 పార్‌)’’ అని చెప్పారు. ‘‘ఉనికిపరంగానే గాక భావజాలపరంగా కూడా బీజేపీ మాత్రమే దేశంలో సిసలైన జాతీయ పార్టీ. ఎందుకంటే దేశమే ముందన్నది మా మూల సిద్ధాంతం’’ అని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలో మోదీ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... 

కాంగ్రెస్‌కు లారీల్లో నల్లధనం! 
‘అదానీ–అంబానీ’ అవినీతి అంటూ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను కొన్నేళ్లుగా నిత్యం విమర్శిస్తూ వచి్చన రాహుల్‌ బాబా ఎన్నికలు మొదలవగానే ప్లేటు ఫిరాయించారు. ఆయన ప్రచారంలో ఎక్కడా వారి ప్రస్తావనే లేదు! హఠాత్తుగా ఎందుకీ మార్పు? ఎందుకంటే అంబానీ, అదానీలతో లోపాయకారీ లింకులున్నది కాంగ్రెస్‌ పారీ్టకే. 

తమకు లారీల నిండా డబ్బులు పంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడబోమన్న కాంగ్రెస్‌ అగ్ర నేత అ«దీర్‌ రంజన్‌ చౌధరి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అదానీ, అంబానీలతో కాంగ్రెస్‌కు డీల్‌ కుదరడం, రాహుల్‌ తమను విమర్శించకుండా ఉండేందుకు వారిద్దరూ లారీల నిండా నల్లధనం పంపడం నిజమో కాదో చెప్పాలి! ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలూ పస లేనివే. అవి రెండూ స్వతంత్రంగా పని చేసే సంస్థలని స్వయానా అ«దీర్‌ చేసిన తాజా ప్రకటనే అందుకు నిదర్శనం. 

‘ప్రత్యేక పౌరుల’ హోదాకు ఒప్పుకోను 
మైనారిటీ సంతుïÙ్టకరణ కోసం కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయాలనే నా ఎన్నికల ప్రసంగాల్లో బయట పెడుతున్నాను. అంతే తప్ప మైనారిటీలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ కూడా వారికెప్పుడూ వ్యతిరేకం కాదు. కాకపోతే ‘ప్రత్యేక పౌరుల’ హోదాను ఎప్పటికీ అంగీకరించబోను. ఎందుకంటే ప్రజలందరూ సమానమే.

 కేవలం ఎన్నికల రాజకీయాల కోసం రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక స్ఫూర్తికి నిత్యం గండి కొట్టే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెసే. రిజర్వేషన్లకు మతం ప్రాతిపదిక కారాదని అంబేడ్కర్, నెహ్రూతో సహా రాజ్యాంగ నిర్మాతలంతా తీసుకున్న నిర్ణయానికి తూట్లు పొడుస్తోంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో నిండా ముస్లిం లీగ్‌ ఛాయలే! చివరికి టెండర్ల కేటాయింపు వంటివాటిలో కూడా మైనారిటీలకు రిజర్వేషన్లిస్తామని అందులో హామీలు గుప్పించారు.

 కేంద్రంలో అధికారంలో ఉండగా పాకిస్తాన్‌తో సమర్థంగా వ్యవహరించకుండా జాతి ప్రయోజనాలనే పణంగా పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. రాహుల్‌ వ్యాఖ్యలను పాక్‌ నేతలు ప్రశంసిస్తున్న పరిస్థితి! మన వీర సైనికులను పొట్టన పెట్టుకున్నది పాక్‌ ఉగ్రవాదులు కాదని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. పాక్‌ వద్ద అణుబాంబులున్నాయి గనుక ఆ దేశాన్ని గౌరవించాలని చెబుతున్నారు.

 సర్జికల్‌ దాడులకు రుజువులేవని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించడం, కాంగ్రెస్‌ కుట్రలను బయట పెట్టడం నా బాధ్యత. కాంగ్రెస్‌ది సంతుïÙ్టకరణ బాట. నాది అందరినీ సంతృప్తిపరిచే అభివృద్ధి బాట. ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడానికి కాంగ్రెస్, ఇండియా కూటమి పారీ్టల పేలవ ప్రచారం కూడా ఓ కారణం. వాటికి సొంత కార్యకర్తలు కూడా ఓటేయడం లేదు. ఇదంతా బీజేపీకే లాభం చేకూరుస్తుంది. 

బీజేడీ పుట్టి మునుగుతోంది 
ఒడిశా ప్రజలు మార్పు కావాలని నిర్ణయించుకున్నారు. నవీన్‌ పటా్నయక్‌ ప్రభుత్వంపై వారిలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అధికార బిజూ జనతాదళ్‌ మనుగడ ఇక కష్టమే. ఒడిశాలో బీజేపీ ఐదేళ్లుగా తీవ్రంగా కష్టపడి నంబర్‌ టూ నుంచి నంబర్‌వన్‌ స్థానానికి చేరింది. 

యూసీసీ హామీ నెరవేరుస్తాం 
ఉమ్మడి పౌర స్మృతి, ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బీజేపీ మేనిఫెస్టో హామీలు. వాటిని నెరవేర్చి తీరతాం. జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే ముందుగా మేమేం చేయాలో సూచించాల్సిందిగా దేశ యువతనే అడగదలచుకున్నా. అందుకోసం ‘తొలి 100 రోజుల కార్యాచరణ’ను 125 రోజులకు పొడిగించాను. మాకు 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న విపక్షాల విమర్శలు నిరాధారం. నేను స్వీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నానని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ నా శ్రేయస్సు కూడా రాజ్యాంగ శ్రేయస్సులోనే ఇమిడి ఉంది. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే రాజ్యాంగం వల్లే. నేను స్ఫూర్తి, శక్తి పొందేదే రాజ్యాంగం నుంచి!

బ్రాండ్‌ మోదీ!
నేను కార్యసాధకున్ని. ‘బ్రాండ్‌ మోదీ’ అన్నది రెండు దశాబ్దాల పై చిలుకు ప్రజా జీవితంలో వారి నుంచి సంపాదించుకున్న విశ్వాస ఫలితం. అంతే తప్ప దానికోసం నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. నేనూ మనిíÙనే. తప్పిదాలు చేసుండొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశాలు మాత్రం నాకెప్పుడూ ఉండవు. మండెటెండల్లో కూడా నా సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వారి కళ్లలో నాపై కనిపించే తిరుగులేని విశ్వాసమే నాకు శక్తినిచ్చి నడిపిస్తోంది. 13 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా చేసిన వ్యక్తి మాతృమూర్తి తన చివరి రోజుల్ని ప్రభుత్వాసుపత్రిలో గడిపిందంటే, అలాంటి దేశానికి మరే ఇతర బ్రాండూ అవసరం లేదని నా అభిప్రాయం. అతడు భిన్నమైన వ్యక్తి అని ఆ దేశం ఏనాడో అర్థం చేసుకుంది’’.

రూ.250 కోట్ల అవినీతి కంటే  250 జతల బట్టలు మేలే! 
తాను అత్యంత ఖరీదైన దుస్తులు ధరిస్తానంటూ రాహుల్‌ తదితరులు చేసే ఆరోపణలపై మోదీ ఆసక్తికరంగా స్పందించారు.  ‘‘నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద ఆరోపణ దుస్తుల గురించే! నాకు 250 జతల బట్టలున్నాయని గతంలో గుజరాత్‌ మాజీ సీఎం అమర్‌సింగ్‌ చౌదరి ఆరోపణలు చేశారు. అప్పుడు నేను సీఎంగా ఉన్నా. అదే రోజు ఓ సభలో పాల్గొన్నా. ‘రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా, లేక 250 జతల బట్టలున్న ముఖ్యమంత్రా?’ అని వేదిక నుంచి ప్రజలనడిగా. 250 జతల బట్టలున్నా పర్లేదు గానీ అవినీతిపరుడు వద్దని వారంతా ముక్త కంఠంతో చెప్పారు. దాంతో విపక్షాలు ఇంకెప్పుడూ నాపై అవినీతి ఆరోపణలకు ధైర్యం చేయలేదు’’ అన్నారు. నిజానికి తనకెప్పుడూ అన్ని జతల బట్టల్లేవంటూ ముక్తాయించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement