నరసరావుపేట టౌన్: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ భాస్కర్ మంగళవారం తెలిపారు. పోలింగ్ రోజు టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో సుమారు 200 మంది మారణాయుధాలతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుపడిన ఎమ్మెల్యే మామ రామకోటిరెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల్లో లాం కోటేశ్వరరావు, శాఖమూరి మారుతి, బండా నాగూర్, మహబూబ్ బాషా, ఖాజా, ఇంటూరి మహేష్, తిరుపతి తొమ్మిది మంది అరెస్ట్ చేశారు.