వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా గురువారం పండుగలా నిర్వహించారు. జిల్లాలోని ముఖ్య పట్టణాలతోపాటు గ్రామగ్రామాన వేడుకలు జరుపుకున్నారు. వాడవాడలా పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ జనం కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, తిరిగి అధికారంలోకి రావడం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. – సాక్షి, నెట్‌వర్క్
భట్టిప్రోలులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు
బాపట్లలో కేక్ కట్ చేస్తున్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
పర్చూరులో మాట్లాడుతున్న ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి
చీరాలలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న
సమన్వయకర్త కరణం వెంకటేష్‌బాబు, పార్టీ నాయకులు
చెరుకుపల్లిలో కేక్ కట్ చేస్తున్న పార్టీ నాయకులు


