తెనాలిలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

తెనాలిలో భారీ చోరీ

Mar 13 2026 7:55 AM | Updated on Mar 13 2026 7:55 AM

10 కిలోల వెండి, 10 గ్రాముల బంగారం అపహరణ

తెనాలి రూరల్‌: తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ సాయి బాలాజీ జ్యుయలర్స్‌లో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీచోరీ జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గూర్ఖా గమనించి యజమానికి ఫోన్‌ చేసి పిలిపించడంతో విషయం బయటపడింది. షాపు యజమాని ఫిర్యాదుతో సీఐ రాముల నాయక్‌ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. దాదాపు తొమ్మిది కిలోల వెండి ముడి సరుకు, ఒక కిలో వెండి వస్తువులు, 10 గ్రాముల బంగారం అపహరణకు గురైనట్లు షాపు యజమాని ఫిర్యాదు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. సీసీ టీవీ ఫుటేజ్‌ల్లో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి వెళుతున్నట్టు గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement