చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం | 18 killed, four injured as mini goods vehicle plunges into valley in Chhattisgarh | Sakshi
Sakshi News home page

చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం

May 21 2024 4:56 AM | Updated on May 21 2024 4:56 AM

18 killed, four injured as mini goods vehicle plunges into valley in Chhattisgarh

వ్యాన్‌ లోయలో పడి 19 మంది మృతి 

దుమ్ముగూడెం: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కబిర్‌ధామ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్‌ వ్యాన్‌ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. 

మృతుల్లో 18 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కభీర్‌దామ్‌ జిల్లాలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్‌ వ్యాన్‌ కుక్‌దూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో బంజారి ఘాట్‌లో అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది.

Advertisement
 
Advertisement
Advertisement