నెల రోజుల్లోపే ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sakshi
Sakshi News home page

Rathnam Movie: ఓటీటీకి వచ్చేస్తోన్న రత్నం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Tue, May 21 2024 2:51 PM

Kollywood Star Hero Vishal Rathnam Movie Ott Date Fix

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్,  ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం 'రత్నం'. గతనెల ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఈనెల 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్‌ వచ్చేస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement