కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన కన్నప్ప టీం! | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌.. కన్నప్ప టీం వీడియో వైరల్!

Published Mon, May 20 2024 8:10 PM

Manchu Vishnu Shares Cannes Film Festival Video Goes Viral

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇటీవలే రెబల్ స్టార్‌ ప్రభాస్ ‍సైతం తన షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ సైతం కన్నప్పలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ  చిత్రంలో మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ కీలకపాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌, నయనతారతో పాటు భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు.  

తాజాగా కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌-2024లో కన్నప్ప టీం సందడి చేసింది. మంచు విష్ణు, మోహన్‌ బాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. 'హారిజన్: యాన్ అమెరికన్ సాగా' స్క్రీనింగ్‌లో వీరంతా పాల్గొన్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement