వేసవిలో కళ్లుమంటలా.. ఇలా చేయండి | Sakshi
Joy of Pets

వేసవిలో చాలామందికి కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడి మంటలు కామన్‌.

కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.

పాలు,లేదా కలబంద రసంలో దూదిని ముంచి 15 నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే అలసట తగ్గుతుంది.

గంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుంది.

నిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు వేసుకోవాలి.

దీంతో ఉదయానికి కళ్ళు నిర్మలంగా,స్వచ్ఛంగా ఉంటాయి.

కళ్ళు మంటగా వుంటే శుభ్రమైన చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి.

రోజ్‌ వాటర్‌లో ముంచిన దూదిని రెప్పులపై 10–15 నిమిషాల పాటుఉంచితే గాయాలకి, మంటలకి ఉపశమనం.

దోసకాయ ముక్కల్ని కట్‌ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచుకుంటే మంచిది.

తడిపిన తెల్లటి వస్త్రంలో మల్లె,నంది వర్ధనం పూలు ఉంచి కళ్లమీద ఉంచుకుంటే చల్లగా ఉంటుంది.

పచ్చి బంగాళదుంపను చక్రాల్లా తరిగి ఆ ముక్కలను కళ్ళపై పెట్టుకుంటే ఉపశమనం.