బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా? | Sakshi
Sakshi News home page

బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?

Published Tue, May 21 2024 6:23 PM

TPEM and TMPV Join Hands With Bajaj Finance

డీలర్‌లకు ఫైనాన్సింగ్ ఎంపికలను మెరుగుపరచడానికి, అలాగే సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా టాటా మోటార్స్ అనుబంధ సంస్థలైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV), టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM).. బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపాయి. 

ఈ భాగస్వామ్యానికి సంబంధించిన MoUపై  టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & డైరెక్టర్ ధీమన్ గుప్తా.. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ భట్ సంతకం చేశారు.

ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మా డీలర్ భాగస్వాములు మా వ్యాపారంలో అంతర్భాగంగా ఉన్నారు. వారి కార్యకలాపాలను సులభతరం చేయడంలో వారికి సహాయపడే పరిష్కారాల కోసం చురుకుగా పని చేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ కోసం బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని ధీమాన్ గుప్తా అన్నారు.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ సాహా మాట్లాడుతూ.. బజాజ్ ఫైనాన్స్‌లో వ్యక్తులు, వ్యాపారాలు రెండింటినీ శక్తివంతం చేసే ఫైనాన్సింగ్ సొల్యూషన్లు ఉన్నాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. మేము TMPV & TPEM అధీకృత ప్రయాణీకులకు, ఎలక్ట్రిక్ వాహనాల డీలర్‌లకు ఆర్థిక మూలధనాన్ని అందిస్తాము. ఈ సహకారం డీలర్‌లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా భారతదేశంలో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement