ఓటేసేందుకు మూడు కోట్ల కారులో వచ్చిన హీరోయిన్! | Shilpa Shetty Arrives In 3 Crore Swanky New Car To Cast Vote In Mumbai | Sakshi
Sakshi News home page

ఓటేసేందుకు మూడు కోట్ల లగ్జరీ కారు.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

May 20 2024 6:45 PM | Updated on May 20 2024 7:12 PM

Shilpa Shetty Arrives In 3 Crore Swanky New Car To Cast Vote In Mumbai

సెలబ్రిటీలు అంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. ఇక వాళ్ల లైఫ్‌ అంతా లగ్జరీ స్టైలే. సినీతారలు ఎక్కడికెళ్లినా కెమెరాల కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. దీంతో వారు బయటికి వచ్చారంటే ఆ రేంజ్‌ వేరే లెవల్లో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇవాళ దేశవ్యాప్తంగా ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని బాలీవుడ్‌ ప్రముఖులు అంతా ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పలువురు ‍అగ్రతారలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి సైతం తన ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తన తల్లి సునంద, సోదరి షమితతో కలిసి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్‌ కారులో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె ఇటీవలే ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా..  శిల్పా చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో కనిపించింది, ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement