మోసగాళ్ల కూటమి | Narendra Modi comments on Congress | Sakshi
Sakshi News home page

మోసగాళ్ల కూటమి

May 22 2024 4:24 AM | Updated on May 22 2024 4:24 AM

Narendra Modi comments on Congress

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

మహారాజ్‌గంజ్‌/మోతిహరీ/ప్రయాగ్‌రాజ్‌: సార్వ త్రిక సమరంలో విపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మంగళవారం బిహార్‌లోని మహారాజ్‌గంజ్, పూర్వీ చంపారన్‌ నియోజకవర్గాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో ప్రసంగించారు. ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తప్పదు
‘‘ సనాతన ధర్మ వ్యతిరేక భావనలు ఆ కూటమిలో నిండిపోయాయి. అవినీతి, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిన విపక్షాల కూటమికి జూన్‌ 4న ఫలితాల సందర్భంగా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. వారసత్వంపై నాకు నమ్మకం లేదు. నాకు వారసులు అంటూ ఒకవేళ ఉంటే అది ప్రజలే. గతంలో ఆర్జేడీ–కాంగ్రెస్‌ ప్రభుత్వం బిహార్‌ను అస్తవ్యస్తంగా పాలించి తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ పుట్టిన నేలకు అపకీర్తి తెచ్చారు. 1990లలో బిహార్‌లో బెదిరింపు పన్ను వ్యవస్థ రాజ్యమేలింది.

దీంతో పరిశ్రమలు, ఉపాధిలేక వేలాదిగా బిహారీలు వలస బాటపట్టారు. ఎన్‌డీఏ ప్రభుత్వాలు వలస సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఎంతో కృషిచేశాయి. పంజాబ్, తెలంగాణ, తమిళనాడులో బిహార్‌ కూలీలపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్‌ రాజకుటుంబం మౌనంగా ఉండిపోయింది’’

దశలు దాటే కొద్దీ దిగజారిపోయారు
‘‘లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే విపక్షాల కూటమి డీలాపడింది. రెండో, మూడో, నాలుగో, ఐదో దశకొచ్చేసరికి మొత్తం నీరుగారిపోయారు. మిగిలిన రెండు దశల్లోనూ ఇదే వరస. జూన్‌ 4 వచ్చే ఫలితాలతో ఆ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అసలు ఆ కూట మికి ఒక రాజకీయ కూటమి లక్షణాలే ఉండవు. అందులో ని అన్ని పార్టీల నేతలంతా కలిసి రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు. వందశాతం మోసగాళ్ల కూటమి అది. కూటమికి మూడు పెద్ద అవలక్షణాలున్నాయి. అది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి’’. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement