అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా? | Sakshi
Sakshi News home page

అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?

Published Mon, May 20 2024 12:58 PM

funeral cost jump to Rs 30 lakh in canada Families owes

కెనడాల్లో అంత్యక్రియలకు బోలెడు ఖర్చు

శవాలను వదిలించుకుంటున్న ఆత్మీయులు

ఆస్పత్రిలో దిక్కు, దివానా లేకుండా కుళ్లిపోతున్న శవాలు

అంత్యక్రియలకు కనీస ఖర్చు 10వేల డాలర్లు

కెనడా శ్మశానంలో ఆరడుగల జాగకు 3వేల డాలర్లు

మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కార్ల్‌మార్క్స్ చాలాకాలం క్రితమే తేల్చేశాడు కానీ.. ఈ సూత్రానికి మినహాయింపులూ చాలానే ఉన్నాయి. సమాజం మాట కాకపోయినా.. తల్లిదండ్రులు.. దగ్గరి బంధువులతో సంబంధాలను, డబ్బుతో ముడి పెట్టకుండా చూసుకునేవారు చాలామందే కనిపిస్తారిప్పుడు. అయితే.. కెనెడాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. దహన సంస్కారాలకు ఎక్కువ ఖర్చు అవుతోందన్న కారణంగా చాలామంది శవాలను మార్చురీల్లో కుళ్లిపోయేలా చేస్తున్నారని చెబుతున్న ఈ వార్తలు అయ్యో అనిపించేవి.

అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు  రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో   ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం.

ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న దుఃఖం, మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా  వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలకుపై మాటే.. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.


దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 3 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్‌టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్‌లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement