‘సాయిపల్లవి’ బర్త్‌డే స్పెషల్‌ | Sakshi
Joy of Pets

సహజమైన నటనతో నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామ సాయిపల్లవి.

తమిళనాడులోని కోటగిరిలో మే 9న, 1992లో జన్మించింది.

జార్జియాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివింది.

తాజాగా ఇవాళ 33వ వసంతంలోకి అడుగుపెడుతోంది ముద్దుగుమ్మ.

మలయాళంలో ప్రేమం మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఫిదా చిత్రంతో అరంగేట్రం చేసింది.

ఆ తర్వాత ఎంసీఏ, లవ్‌ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం నాగచైతన్య సరసన నటిస్తోంది.

వీరిద్దరు గతంలో లవ్‌ స్టోరీ అనే మూవీలో జంటగా నటించారు.

తండేల్‌ టైటిల్‌లో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బుజ్జితల్లిగా సందడి చేయనుంది.

చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇవాళ సాయిపల్లవి బర్త్‌ డే సందర్భంగా తండేల్‌ టీమ్‌ స్పెషల్‌ వీడియోను రిలీజ్ చేసింది.