SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు) | IPL 2024: Arshdeep Singh Met Abhishek Sharma Mother And Took Blessings After The Match Photos | Sakshi
Sakshi News home page

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

Published Tue, May 21 2024 6:30 PM | Updated 30 Min Ago

1/16

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ దుమ్ములేపుతున్నాడు.

2/16

ఇప్పటి వరకు లీగ్‌ దశలో ఆడిన 13 ఇన్నింగ్స్‌లో కలిపి 467 పరుగులు చేశాడు ఈ 23 ఏళ్ల లెఫ్టాండర్‌ బ్యాటర్‌.

3/16

పంజాబ్‌కు చెందిన అభిషేక్‌ శర్మకు అతడి తండ్రే క్రికెట్‌లో ఓనమాలు నేర్పారు.

4/16

ఇక సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతున్న అభిషేక్‌ను చీర్‌ చేసేందుకు అతడి తల్లి మంజు, సోదరి కోమల్‌ శర్మ ఎప్పుడూ అతడి వెంటే ఉంటారు.

5/16

స్టేడియంలో అభిషేక్‌తో కలిసి వీరు సందడి చేస్తారు.

6/16

ఇక ఆదివారం సన్‌రైజర్స్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.

7/16

లీగ్‌ దశలో ఆఖరిదైన ఈ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.

8/16

అభిషేక్‌ శర్మ 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.

9/16

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

10/16

మ్యాచ్‌ ముగిసిన అనంతరం అభిషేక్‌ శర్మ, అర్స్‌దీప్‌ సింగ్‌ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ డగౌట్‌ వరకూ వచ్చారు.

11/16

అక్కడ అభిషేక్‌ శర్మ తల్లి మంజు కనిపించగానే.. అర్ష్‌దీప్‌.. ‘‘అభిషేక్‌ శర్మను ఏమని దీవిస్తారో.. నన్ను కూడా అచ్చంగా అలాగే ఆశీర్వదించండి’’ అని కోరాడు.

12/16

ఇందుకు సంబంధించిన దృశ్యాలను అభిషేక్‌ సోదరి కోమల్‌ షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి.

13/16

కాగా ఇటీవల గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ సమయంలో ఆ జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అభిషేక్‌ తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు అందుకున్న విషయం తెలిసిందే.

14/16

15/16

16/16

Advertisement
 
Advertisement