కౌంటింగ్‌ ప్రక్రియకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ ప్రక్రియకు సన్నాహాలు

Published Wed, May 22 2024 9:45 AM | Last Updated on Wed, May 22 2024 9:45 AM

కౌంటి

కౌంటింగ్‌ ప్రక్రియకు సన్నాహాలు

కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

కమలాపురం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. జూన్‌ నెల 4 వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గ కౌంటింగ్‌కు సంబంధించి చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కమలాపురం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు అధికారులతో ఎస్పీ మంగళవారం సూక్ష్మ స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ, ఎవరు , ఎలా విధులు నిర్వర్తించాలో ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్‌ నేపథ్యంలో జూన్‌ 1వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ఎలాంటి ఊరేగింపులూ, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాజకీయ నేతల గృహ నిర్భంధాలు, జిల్లా బహిష్కరణ అమలు చేస్తామని వివరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించినవారిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప డీఎస్‌పీ ఎండీ షరీఫ్‌, నియోజకవర్గ నోడల్‌ అఽధికారి, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సుధాకర్‌, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్‌ రాజు, కమలాపురం సీఐ రామ క్రిష్ణారెడ్డి, సీకేదిన్నె సీఐ శంకర్‌ నాయక్‌, కడప రూరల్‌ సీఐ పార్థ సారధి, ఎస్‌ఐలు హృషీ కేశవరెడ్డి, వెంకట రమణ, హరి ప్రసాద్‌ పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరిది, కీలకమైనదైన ఓట్ల లెక్కింపు జూన్‌ 4వ తేది జరగనుంది. కడప సమీపంలోని మౌలాన అబుల్‌ కలాం ఆజాద్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ఇందుకు వేదిక కానుంది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన సన్నాహాల్లో నిమగ్నమైంది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 1963 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ మొత్తం పోలింగ్‌ కేంద్రాలకుగాను 144 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. జిల్లాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, సెగ్మెంట్‌కు 14 చొప్పున ఈవీఎం టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16, సెగ్మెంట్స్‌కు సంబంధించి ప్రత్యేక హాలులో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22,669 పోస్టల్‌ బ్యాలెట్లు పోల్‌కాగా, ఎంపీ స్థానానికి 22,657 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి.

124–బద్వేలు: ఈ నియోజకవర్గంలో 272 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 11 రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకోసం నియోజకవర్గానికి 14 ఈవీఎం టేబుల్స్‌, సెగ్మెంట్‌కు సంబంధించి 14 టేబుల్స్‌ ఉంటాయి. అసెంబ్లీకి రెండు పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఉండగా, సెగ్మెంట్‌(ఎంపీ పరిధి)కు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు కలిపి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ స్థానంలో 3077 పోస్టల్‌ బ్యాలెట్లు, సెగ్మెంట్‌లో కూడా 3077 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి.

126–కడప: ఈ నియోజకవర్గంలో 287 పోలింగ్‌ కేంద్రాలకుగాను 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 14 చొప్పున అసెంబ్లీ, సెగ్మెంట్‌ ఈవీఎం టేబుళ్లు ఉంటాయి. ఇక అసెంబ్లీకి 5637, సెగ్మెంట్‌కు 5632 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదయ్యాయి.

129–పులివెందుల: ఈ నియోజకవర్గంలో 301 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఇందుకోసం అసెంబ్లీకు 14, సెగ్మెంట్‌కు 14 చొప్పున టేబుళ్లు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి 2862, సెగ్మెంట్‌కు 2862 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి.

130– కమలాపురం: ఈ నియోజకవర్గంలో 251 పోలింగ్‌ కేంద్రాలకుగాను 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఇందుకోసం అసెంబ్లీకి, సెగ్మెంట్‌కు 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి 2009, సెగ్మెంట్‌కు 2008 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి.

131–జమ్మలమడుగు: ఈ నియోజకవర్గంలో 315 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. 14 చొప్పున అసెంబ్లీ నియోజకవర్గం, సెగ్మెంట్‌కు ఈవీఎం టేబుళ్లు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి 2924, సెగ్మెంట్‌కు కూడా 2924 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి.

132– ప్రొద్దుటూరు: ఈ నియోజకవర్గంలో 268 పోలింగ్‌ కేంద్రాలకుగాను 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. అసెంబ్లీ నియోజక వర్గానికి 14, సెగ్మెంట్‌కు 14 చొప్పున ఈవీఎం టేబుళ్లు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి 3613, సెగ్మెంట్‌కు 3609 చొప్పున పోస్టల్‌ బ్యాలెట్లు నమోదయ్యాయి.

133– మైదుకూరు: ఈ నియోజకవర్గంలో 269 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా, 20 రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 14 చొప్పున అసెంబ్లీ నియోజకవర్గం, సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం టేబుళ్లు ఉంటాయి. అసెంబ్లీ నియోజకవర్గానికి 2547 పోస్టల్‌ బ్యాలెట్లు, సెగ్మెంట్‌కు 2545 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి.

ఒక్కో నియోజకవర్గం,సెగ్మెంట్‌కు 14 చొప్పున టేబుళ్లు

18 నుంచి 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22,669 పోస్టల్‌ బ్యాలెట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
కౌంటింగ్‌ ప్రక్రియకు సన్నాహాలు 1
1/1

కౌంటింగ్‌ ప్రక్రియకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement