Rasi Phalalu: ఈ రాశివారి జీవితాశయం నెరవేరుతుంది | Today Telugu Horoscope On May 22nd, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారి జీవితాశయం నెరవేరుతుంది

May 22 2024 6:54 AM | Updated on May 22 2024 11:29 AM

Today Horoscope 22-05-2024 in Telugu

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.56 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: స్వాతి ఉ.7.16 వరకు, తదుపరి విశాఖ వర్జ్యం: ప.1.15 నుండి 2.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31  నుండి 12.19 వరకు, అమృతఘడియలు: రా.11.28 నుండి 1.11 వరకు. 

మేషం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.

మిథునం: ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

కర్కాటకం: ప్రయాణాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తిలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

కన్య: రుణయత్నాలు సానుకూలం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

తుల: నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి సమస్యలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. సంఘంలో గౌరవం పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

మకరం: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

కుంభం: మిత్రులు, బంధువులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: శ్రమ మరింతగా పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement