గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు. సప్తమి ప.11.58 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: జ్యేష్ఠ రా.10.55 వరకు తదుపరి మూల, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.08 వరకు, అమృత ఘడియలు: ప.1.12 నుండి 2.58 వరకు.
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.00
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం... నూతన పరిచయాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
మిథునం.... కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కర్కాటకం... వ్యయప్రయాసలు. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
సింహం... బంధువులతో తగాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య... మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
వృశ్చికం... ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలిసివస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
ధనుస్సు... పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం... రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. గృహయోగం. చర్చలు సఫలం. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం... మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా పడతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. రుణయత్నాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.


