గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.పంచమి ఉ.8.43 వరకు తదుపరి షష్ఠి , నక్షత్రం: విశాఖ సా.6.19 వరకు తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.10.40 నుండి 12.25 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.20 వరకు, అమృత ఘడియలు: ఉ.8.52 నుండి 10.34 వరకు.
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.01
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
మిథునం.... కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
కర్కాటకం.... పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
సింహం.... సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.
కన్య... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. దూరపు బంధువులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
తుల.... కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యం.
వృశ్చికం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. ఆస్తి లాభం. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం.
ధనుస్సు.... విద్యార్థులకు నిరుత్సాహం. కొన్ని పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం... నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. భూలాభాలు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మీనం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు నెలకొంటాయి. పనులలో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.


