ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 11-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు

Sep 11 2026 3:07 AM | Updated on Sep 11 2026 3:07 AM

Rasi Phalalu: Daily Horoscope On 11-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: అమావాస్య ఉ.8.44 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమి, నక్షత్రం: పుబ్బ ప.2.16 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం:  రా.9.25 నుండి 11.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు, అమృత ఘడియలు: ఉ.8.01 నుండి 9.34 వరకు, పోలాల అమావాస్య.

సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల విషయంలో చికాకులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

వృషభం.... సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మిథునం... రుణబాధల నుండి విముక్తి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం... అనుకున్న డబ్బు సమకూరడంలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం.... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటాయి.

కన్య.... రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ఆలయ దర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

తుల..... ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కవచ్చు.

వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు చిక్కులు.

మకరం.... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో విరోధాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కుంభం.... మీ శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం... సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement