గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.11.54 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: ఆశ్లేష ప.3.48 వరకు తదుపరి మఖ, వర్జ్యం: రా.3.20 నుండి 4.54 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: ప.2.17 నుండి 3.48 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... అనుకోని ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడుల. లేనిపోని శ్రమ. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు. ఆలయ దర్శనాలు.
వృషభం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
మిథునం..... వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
కర్కాటకం.... కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహావంతంగా ఉంటాయి.
సింహం.... బంధువులతో తగాదాలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలు ఇబ్బందిగా మారవచ్చు. అనారోగ్యం.
కన్య.... మిత్రుల సాయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. సన్నిహితులతో ఆనంందగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల... మీ కృషి ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల కలయిక. చర్చలు సఫలం. ఊహించని ధనలబ్ధి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.
వృశ్చికం..చేపట్టిన పనులు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
ధనుస్సు....ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం....ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం...పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశయాలు నెరవేరతాయి. స్థిరాస్తి వృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.
మీనం....ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.


