ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 05-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు

Sep 5 2026 2:43 AM | Updated on Sep 5 2026 2:43 AM

Rasi Phalalu: Daily Horoscope On 05-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.నవమి రా.9.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: మృగశిర రా.9.47 వరకు, తదుపరి ఆరుద్ర,వర్జ్యం: తె.5.36 నుండి 7.05 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.5.49 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: ప.1.34 నుండి 3.03 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం     :  6.09
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం... ఏ పని చేపట్టినా ముందుకు కదలని పరిస్థితి. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు. మరోవైపు ఆలోచనలు కలసిరావు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. సోదరులతో కలహాలు. వృత్తులు, వ్యాపారాలలో చికాకులు.

వృషభం.... విద్యార్థులకు కొత్త ఆశలు కలుగుతాయి. బాధ్యతలు నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. రాబడి కొంత పెరుగుతుంది. వృత్తులు, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిథునం.... ప్రతి విషయంలో తొందరవద్దు. ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. వృత్తులు, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం... దూరప్రాంతాల నుండి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. వృత్తులు,వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కళాకారులకు అనూహ్య అవకాశాలు.

సింహం.... దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. కొన్ని నిర్ణయాలు సమయానుసారం తీసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. వృత్తులు, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి. రాజకీయవేత్తలకు పదవీయోగం.

కన్య.... ఏ పని చేపట్టినా ముందుకు కదలని పరిస్థితి. కొన్ని విషయాలలో తొందరపడి నిరాశ చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వృత్తులు,వ్యాపారాలు నిదానిస్తాయి.

తుల.... ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. అనారోగ్యం. వృత్తులు,వ్యాపారాలలో ఒడిదుడుకులు. శ్రమ తప్ప ఫలితం ఉండదు.

వృశ్చికం... రుణవిముక్తి లభిస్తుంది. అనుకున్న వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

ధనుస్సు.... అప్రయత్న కార్యసిద్ధి. విలువైన సమాచారం అందుతుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం.... ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలలో గందరగోళం. ఆస్తి తగాదాలు. మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. వృత్తులు, వ్యాపారాలలో చికాకులు .

కుంభం.... అంచనాలు కొన్ని తప్పుతాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో ఇబ్బందులు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. కళాకారులకు నూతనోత్సాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement