గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.తదియ ఉ.8.34 వరకు, తదుపరి చవితి,నక్షత్రం: రేవతి తె.4.09 వరకు (తెల్లవారితే మంగâ¶ వారం), తదుపరి అశ్విని, వర్జ్యం: సా.4.20 నుండి 5.54 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.15 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు,అమృత ఘడియలు: రా.1.46 నుండి 3.20 వరకు, సంకటహర చతుర్ధి.
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... పనులలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగుల మందగిస్తాయి.
వృషభం... నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది..
మిథునం.... పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం... దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు పనులు ముందుకు సాగవు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం.... కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య..... బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
తుల... శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.
వృశ్చికం... వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు.. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం.... పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. వాహనాలు కొంటారు. పాతస్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
కుంభం... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవరోధాలు. అనారోగ్యం. లేనిపోని తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
మీనం.. ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.


