ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరపతి పెరుగుతుంది | Rasi Phalalu: Daily Horoscope On 28-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. పరపతి పెరుగుతుంది

Aug 28 2026 3:07 AM | Updated on Aug 28 2026 5:15 AM

Rasi Phalalu: Daily Horoscope On 28-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: పౌర్ణమి ఉ.9.14 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: శతభిషం రా.3.52 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: ఉ.10.19 నుండి 12.00 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.16 వరకు, అమృత ఘడియలు: రా.8.20 నుండి 10.01 వరకు, శ్రావణ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, రాఖీ పండగ.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.16
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... వ్యవహారాలలో విజయం. భూలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

వృషభం.... పరపతి మరింత పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

మిథునం.... కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యవహారాలలో అవరోధాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం... చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

సింహం.... దూరపు బంధువుల కలయిక. ఆస్తిలాభ సూచనలు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి.

కన్య..... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవచింతన.

తుల.... వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత వరకూ అనుకూలిస్తాయి.

వృశ్చికం.. బంధువులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. గృహయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం..... వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కుంభం.... రుణబాధలు తొలగుతాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మీనం...... బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు మందగిస్తాయి. పనులు వాయిదా. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement