గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.ద్వాదశి తె.5.30 వరకు (తెల్లవారితే మంగళ వారం), తదుపరి త్రయోదశి, నక్షత్రం: పూర్వాషాఢ రా.8.57 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: తె.5.43 నుండి 7.28 వరకు,దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.47 వరకు, అమృత ఘడియలు: ప.3.40 నుండి 5.24 వరకు.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.19
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.. అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
వృషభం.... కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం.
మిథునం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి ఒత్తిడులు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం.... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో విజయం. వాహనసౌఖ్యం. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.
సింహం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.
కన్య.... ముఖ్యమైన పనులలో జాప్యం. పట్టుదలతో ముందుకు సాగవు. బంధుమిత్రులతో తగాదాలు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
తుల... పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనుల్లో పురోగతి. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.
వృశ్చికం.... ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
మకరం.... కొన్ని పనుల్లో అవరోధాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి.
కుంభం...... ప్రముఖుల నుంచి శుభవార్తలు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మీనం.. శుభవార్తలు వింటారు. పాతబాకీలు వసూలవుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.


