ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 27-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు

Aug 27 2026 3:01 AM | Updated on Aug 27 2026 3:01 AM

Rasi Phalalu: Daily Horoscope On 27-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.8.27 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ధనిష్ఠ రా.2.49 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.47 వరకు తదుపరి ప.2.57 నుండి 3.47 వరకు, అమృత ఘడియలు: ప.3.43 నుండి 5.25 వరకు.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కాస్త ఊరట.

వృషభం....పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు.

మిథునం...ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు గందరగోళంగా ఉంటుంది.

కర్కాటకం....ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక.  ఇంటాబయటా ప్రోత్సాహం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త విషయాలు తెలుస్తాయి.

సింహం....నూతన పరిచయాలు. ధార్మిక సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. పనులలో అనుకూలత. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు కొత్త ఆశలు.

కన్య....ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. పనుల్లో అనుకూలత. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల......ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

వృశ్చికం....పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు, వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు...వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మకరం...కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో పురోగతి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తగ్గవచ్చు.

కుంభం....మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మీనం...ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement