ఈ రాశి వారికి భూ, గృహయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 26-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి భూ, గృహయోగాలు

Aug 26 2026 3:04 AM | Updated on Aug 26 2026 3:04 AM

Rasi Phalalu: Daily Horoscope On 26-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.7.11 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శ్రవణం రా.1.15 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: తె.5.30 నుండి 7.12 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.37 నుండి 12.27 వరకు,అమృత ఘడియలు: ప.1.50 నుండి 3.44 వరకు.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం.... పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృషభం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. దైవదర్సనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

మిథునం.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

కర్కాటకం...... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

సింహం.... ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి లాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య.... వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల...... పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం..... శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు..... ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

మకరం..... కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

కుంభం... ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మీనం..... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. భూ, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement