ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి | Rasi Phalalu: Daily Horoscope On 22-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ధనలాభం.. వ్యాపారాలు లాభిస్తాయి

Aug 22 2026 12:05 AM | Updated on Aug 22 2026 12:05 AM

Rasi Phalalu: Daily Horoscope On 22-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.దశమి రా.1.34 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: జ్యేష్ఠ ప.3.48 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.12.40 నుండి 2.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: ఉ.6.04 నుండి 7.50 వరకు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం :  6.20
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.

వృషభం: కొత్త పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో విజయం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. పనుల్లో విజయం. బంధువుల కలయిక. విద్యావకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

కర్కాటకం: సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. ఖర్చులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి.

తుల: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

ధనుస్సు: కొన్ని పనులను మధ్యలో నిలిపివేస్తారు. బంధువుల నుంచి సమస్యలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఇబ్బందులు.

మకరం: ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

కుంభం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం:  పనులు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement