ఈ రాశి వారికి పనుల్లో విజయం.. భూయోగం | Rasi Phalalu: Daily Horoscope On 30-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి పనుల్లో విజయం.. భూయోగం

Aug 30 2026 2:12 AM | Updated on Aug 30 2026 2:12 AM

Rasi Phalalu: Daily Horoscope On 30-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం,వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.విదియ ఉ.9.17 వరకు, తదుపరి తదియ,నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.4.31 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి రేవతి, వర్జ్యం:  ప.2.03 నుండి 3.41 వరకు, దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.25 వరకు, అమృత ఘడియలు: రా.11.40 నుండి 1.19 వరకు.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.14
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... అనుకున్న వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.

వృషభం... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి లాభం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.

మిథునం.. మిత్రులు సహకరిస్తారు. పనుల్లో విజయం. భూయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకం..... బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం.... ఏ పని చేపట్టినా నిరాశపరుస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కన్య.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల....... ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృశ్చికం..... మిత్రుల నుంచి సమస్యలు. అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

ధనుస్సు.... ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మకరం... కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం... ప్రయాణాలలో ఆటంకాలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఒప్పందాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మీనం... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement