ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 30-08-2026 To 05-09-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Aug 30 2026 3:17 AM | Updated on Aug 30 2026 5:40 AM

Weekly Horoscope Telugu 30-08-2026 To 05-09-2026

మేషం...
ఆర్థిక ఇబ్బందులు అధిగమించి అడుగు ముందుకేస్తారు.  ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు.  ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం ఉండవచ్చు.  సోదరులు అన్నిటా∙సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు, బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు.. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

వృషభం...
బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని వివాదాలు  పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అనుకోనిరీతిలో∙ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం...
కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యాచరణలో పెడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కొన్ని ముఖ్య  సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో  సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం...
ఎంతటి కార్యక్రమమైనా వేగవంతంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయమవుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం...
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాకుండా గడుపుతారు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అయిష్టంగానే కొన్ని మార్పులకు అంగీకరించక తప్పదు.  పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు.  దుర్గాదేవిని ఆరాధించండి.

కన్య...
ఇతరులకు సాయపడుతూ మీ సేవాభావాన్ని చాటుకుంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వేగవంతంగా చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమించి స్థిరత్వం ఏర్పడుతుంది. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

తుల...
కొత్త పరిచయాలతో ఉత్సాహంగా గడుపుతారు. మాటపై నిలపడి ఇతరులకు సాయం అందిస్తారు. బంధువులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు.  ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం..
స్వయంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుని ప్రశంసలు పొందుతారు. కళాళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు...
ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మకరం...
కొన్ని చిక్కులు అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.

కుంభం...
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు  కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబ«ంధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలలో వేగం తగ్గి  స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు.  కాలభైరవాష్టకం పఠించండి.

మీనం...
సమస్యలను∙అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి.. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement