ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు | Rasi Phalalu: Daily Horoscope On 01-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

Sep 1 2026 3:13 AM | Updated on Sep 1 2026 3:13 AM

Rasi Phalalu: Daily Horoscope On 01-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.చవితి ఉ.7.25 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అశ్విని రా.3.24 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.11.31 నుండి 1.04 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు తదుపరి రా.10.51 నుండి 11.37 వరకు, అమృత ఘడియలు: రా.8.24 నుండి 9.56 వరకు.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం.... ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కర్కాటకం... పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పలుకుబడి పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం.... వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

కన్య... కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

తుల... ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం... పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకనంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు... వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం... పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం.... వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

మీనం.... కుటుంబంలో చికాకులు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement