ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 04-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి అప్రయత్న కార్యసిద్ధి

Sep 4 2026 3:11 AM | Updated on Sep 4 2026 3:11 AM

Rasi Phalalu: Daily Horoscope On 04-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.అష్టమి రా.11.28 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: రోహిణి రా.11.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.3.56 నుండి 5.26 వరకు, తదుపరి తె.4.38 నుండి 6.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.13 వరకు, అమృత ఘడియలు: రా.8.24 నుండి 9.54 వరకు, గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమి.

సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు వెంటాడుతూ వేధిస్తాయి. అనారోగ్యం. వృత్తులు, వ్యాపారాలలో కొత్త చిక్కులు. కళాకారులకు అంచనాలలో పొరపాట్లు.

వృషభం..... కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో విశేష ఆదరణ కనిపిస్తుంది. భూముల విషయంలో అగ్రిమెంట్లు. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం.... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలోచనలు ఎటూ తేలవు. స్థిరాస్తి వివాదాలు తలనొప్పిగా మారతాయి.  వృత్తులు, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు.

కర్కాటకం.... కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. వాహనసౌఖ్యం. కొత్త వ్యక్తుల పరిచయం. విద్యార్థుల యత్నాలు వేగవంతంగా కాగలవు. వృత్తులు, వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి.

సింహం.... అప్రయత్న కార్యసిద్ధి. బంధువుల ద్వారా శుభవార్తలు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. వృత్తులు, వ్యాపారాలను సజావుగా నిర్వహిస్తారు.

కన్య.... కొత్త కార్యక్రమాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. బంధువులతో అకారణంగా వైరం. వృత్తులు, వ్యాపారాలలో చిక్కులు ఎదురవుతాయి.కళాకారులు అవకాశాలు చేజార్చుకుంటారు.

తుల.... రుణప్రయత్నాలు సాగిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆలోచనలు స్థిరంగా సాగవు. తొందరపాటు నిర్ణయాలు తగదు. వృత్తులు, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు.

వృశ్చికం.... మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. సోదరులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వృత్తులు, వ్యాపారాలు వేగవంతంగా కాగలవు.

ధనుస్సు.... రుణవిముక్తి కలుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గతం గుర్తుకు వస్తుంది. ఆలోచనలు క్రమపద్ధతిలో అమలు చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి.

మకరం.... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మిత్రుల నుండి ఒత్తిడులు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వృత్తులు, వ్యాపారాలు నత్తనడకన సాగతాయి.

కుంభం.... ఇతరుల కోసం కష్టపడతారు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు.  అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. దైవదర్శనాలు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు.

మీనం..... కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభను వెలుగులోకి తెస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. మితంగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో ఇబ్బందులు తీరతాయి. కళాకారులకు అవకాశాలు రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement