గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.సప్తమి రా.1.46 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: కృత్తిక రా.12.57 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.42 వరకు, అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పనుల్లో మరింత జాప్యం. వృత్తులు, వ్యాపారాలలో ఒడిదుడుకులు. కళాకారుల యత్నాలు నిదానిస్తాయి.
వృషభం.... పలుకుబడి పెరుగుతుంది. అనూహ్యంగా కొత్త వారు పరిచయమవుతారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. విద్యార్థుల యత్నాలు సఫలం.
మిథునం.... వ్యవహారాలను అతికష్టంపై పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. వృత్తులు, వ్యాపారాలలో కొన్ని సమస్యలు. రాజకీయవేత్తలకు నిరుత్సాహం.
కర్కాటకం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలను చాకచక్యంగా పూర్తి చేస్తారు. అద్భుతమైన పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. వాహనయోగం. వృత్తులు, వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు మరిన్ని అవకాశాలు.
సింహం.... కొత్త కార్యక్రమాలు చేపడతారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. అందరిపై ప్రేమాభిమానాలు చూపుతారు. బంధువుల హడావిడి పెరుగుతుంది. వృత్తులు, వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి.
కన్య.... దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కష్టపడతారు ఫలితం ఉండదు. దూరప్రయాణాలు. కుటుంబబాధ్యతలతో సతమతమవుతారు. వృత్తులు, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. క్రీడాకారులకు ఒత్తిడులు.
తుల.. కొన్ని అంచనాలు తప్పుతాయి. కుటుంబంలో చికాకులు. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వృత్తులు, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం... కుటుంబంలో హడావిడిగా ఉంటుంది. సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. వృత్తులు, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. విద్యార్థులకు యత్నకార్యసిద్ధి.
ధనుస్సు.. స్వశక్తితో పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ సఖ్యతగా ఉంటూ వారి ఆదరణ పొందుతారు. వాహనయోగం. కొన్ని చర్చలు సఫలం కాగలవు. వృత్తులు, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ఆహ్వానాలు రాగలవు.
మకరం.... రుణదాతల ఒత్తిడులు తప్పవు. ఊహించని ప్రయాణాలకు సిద్ధం కావాలి. బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలవు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తులు, వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి.
కుంభం.... ఇంటాబయటా సమస్యలు తప్పవు. దూరప్రయాణాలు. మీ కష్టం వృథా కాగలదు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తుల విషయంలో చికాకులు. వృత్తులు, వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు.
మీనం.... వ్యవహారాలు నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వృత్తులు, వ్యాపారాలు అనూహ్యంగా మెరుగుపడతాయి.


