ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం | Rasi Phalalu: Daily Horoscope On 06-09-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Sep 6 2026 2:22 AM | Updated on Sep 6 2026 2:22 AM

Rasi Phalalu: Daily Horoscope On 06-09-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.దశమి సా.6.37 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆరుద్ర రా.8.06, వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.28 నుండి 5.18 వరకు, అమృత ఘడియలు: ఉ.10.48 నుండి 12.19 వరకు.

సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.... పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం... పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కర్కాటకం..... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం.... శుభకార్యాల యత్నాలు సఫలం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య.... కుటుంబసభ్యులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల.... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం.... కుటుంబంలో కొత్త సమస్యలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు.... దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మకరం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కుంభం... కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం..... ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement